ఎంగేజ్మెంట్ చేసుకున్న కమెడియన్ యాదమ్మ రాజు
on Nov 28, 2022
సోషల్ మీడియా పెరిగాక, బుల్లితెర మీద షోస్ బాగా ఎక్కువయ్యాక ఇందులో నటించే కమెడియన్స్ కూడా మస్త్ గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ప్రస్తుతం స్టార్ కమెడియన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్, సద్దాం, నూకరాజు, ఇమ్మానుయేల్, యాదమ్మ రాజు, ఎక్స్ప్రెస్ హరి, ఫైమా, యాదమ్మ రాజు ఇలాంటి వాళ్లంతా ‘జబర్దస్త్’, ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ ‘పటాస్’, "శ్రీదేవి డ్రామా కంపెనీ" లాంటి షోస్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఐతే వీళ్ళలో కమెడియన్ యాదమ్మ రాజు పెళ్ళికి రెడీ అయ్యాడు. లేటెస్ట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు.
"పటాస్" షోలో జస్ట్ ఒక స్టూడెంట్ గా అడుగుపెట్టిన యాదమ్మ రాజు ఒక జోక్ పేల్చి వైరల్ అయ్యాడు. అలా కమెడియన్ గా ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకుని బాగా పాపులర్ అయిపోయాడు. ఇకపోతే ఈ కమెడియన్ కి స్టెలా రాజ్ అనే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. చాలాకాలం నుంచి వీళ్లిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. ఐతే ఇప్పుడు తమ రిలేషన్ ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుని నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రస్తుతం ఆహా ఓటీటీలో ‘కామెడీ స్టాక్ ఎక్సేంజ్’ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాడు యాదమ్మ రాజు. ఇక యూట్యూబర్ గా స్టెల్లా రాజ్ అందరికీ తెలుసు. యాదమ్మ రాజుతో కలిసి ఈమె చాలా ఫన్నీ వీడియోలు కూడా చేసింది. ఇక స్టేజి మీద కామెడీ స్కిట్స్ లో యాదమ్మ రాజుకి జోడీగా సద్దాం చేసే ఫన్నీ స్కిట్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
